24-03-2025 12:15:20 AM
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మార్చి 23 (విజయక్రాంతి): అన్ని వర్గాల ప్రజలందరూ సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ కోరారు. జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, జగిత్యాల పట్టణాలతో పాటూ కోరుట్ల నియోజకవ ర్గంలోని మెట్పెల్లి పట్టణంలో కలెక్టర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయా మునిసిపాలిటీల పరిధిలో ఇంటి పన్నుల వసూలు, ఎల్‌ఆర్‌ఎస్ పనులను పరిశీలించారు. మెట్పల్లి, జగిత్యాల పట్టణాల్లో అత్యధికంగా పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్స్ సంద ర్శించి, రెండు రోజులలో బకాయిలు చెల్లించకుంటే దుకాణాలు సీజ్ చేస్తామని కలెక్టర్ హెచ్చ రించారు.
ఈ నెల 31 వరకు 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా మని, గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట జగిత్యాల, రాయికల్, మెట్పల్లి మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.