16-03-2025 03:40:00 PM
మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్లోని 2024-25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఇంటి పన్ను, వృత్తి వ్యాపార లైసెన్స్ లు, నల్లా బిల్లులు వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని బాన్సువాడ ఆదివారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ పరిధిలో ఇంకా చాల మంది పన్నులు చెల్లించవలసి ఉన్నదని, ఇట్టి పన్నులు చెల్లించని వారి పై మున్సిపల్ చట్టం 2019 ప్రకారం తగు చర్యలు తీసుకోనబడతయని ఆయన తెలిపారు. అదేవిధంగా (ఎల్ ఆర్ ఎస్)దరఖాస్తు చేసుకున్న వారికి 25శాతం రిబెట్ ఇచ్చే అవకాశం ఈ నెల 31 న ముగుస్తున్నందున ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు.