06-02-2025 06:44:43 PM
నిర్మల్ (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని 42 వార్డుల్లో ప్రజలు వాణిజ్య సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు మున్సిపాలిటీకి చెల్లించవలసిన పనులు చెల్లించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని ఆయా వార్డుల్లో పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొని పెండింగ్ పనులను వసూలు చేయించారు. మార్చి 31 వరకు పనులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు.