టీఎన్జీవో నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్‌ఎం హుస్సేన్ ముజీబ్ నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం కలిశారు. పెండింగ్ బిల్లుల మంజూరులో తీవ్రమైన ఆలస్యం జరగడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. దశలవారీగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని, అంశాల వారీగా బిల్లులు చెల్లిస్తామని రామకృష్ణారావు హామీ ఇచ్చినట్టు టీఎన్జీవో నేతలు తెలిపారు.