28-02-2025 01:22:06 AM
మునగాల: ఫిబ్రవరి 27 : కోదాడ నియోజకవర్గం మునగాల మండల లో ప్రతి గ్రామంలో మార్చి 1న మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించాలి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్య మాదిగ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కనకయ్య మాదిగ అధ్యక్షతనజరిగిన పత్రికా విలేకరులసమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ, ఎం.ఎస్.పి.జిల్లాప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలో గల ప్రతి ఊరిలో, మాదిగ మాదిగ ఉప కులాలు, అమరవీరులకు ఘనమైన నివాళులు అర్పించాలని వారి త్యాగఫలితమే ఏబిసిడి వర్గీకరణ,భావితరాల మన మాదిగ బిడ్డలకి న్యాయం జరగడం కోసంవారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన ప్రతిఒక్కరికి పేరుపేరునా ఘనమైన నివాళులు అర్పించాలని. మాదిగజాతి ఉన్నంతవరకు, మీత్యాగాలు ఉంటాయని, మీత్యాగాలు వెలకట్టలేనివి. అన్నారు.