calender_icon.png 19 April, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 వేల కోట్ల ఫీజు బకాయిలను చెల్లించండి

10-04-2025 12:00:00 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తేసే కుట్రలు మానుకోవాలి

లేదంటే విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తాం

ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిక

ముషీరాబాద్, ఏప్రిల్ 9: పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వేలాదిమంది విద్యార్థులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ ర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ ముదిరాజ్  అధ్యక్షతన ఏర్పాటుచేసిన  మీడియా  సమావేశంలో మాట్లాడారు. 14 లక్షల మంది ఎ స్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న రూ.4 వేల కోట్లు దశల వారీగా విడుదల చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేసే కుట్రలను ప్రభుత్వం మానుకోవాలని, లేదం టే విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలతో నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించా రు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నా యకులు  మణికంఠ, రాజేందర్, అనంత య్య, రాందేవ్ మోది, కట్టం లింగస్వామి  తదితరులు పాల్గొన్నారు.