calender_icon.png 5 October, 2024 | 6:45 PM

పిల్లల నడవడికపై శ్రద్ధ వహించాలి

05-10-2024 03:15:35 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): పిల్లల నడవడికపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ సూచించారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడాలో బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బాలికలపై రోజు ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయని ఎందుకు ప్రధాన కారణం విచ్చలవిడిగా సెల్ఫోన్ వాడకం తో పాటు పిల్లల పట్ల తల్లిదండ్రుల నియంత్రణ లేమి ప్రధానంగా కనిపిస్తుందన్నారు.

సమాజంలో భక్తులను గుడ్డిగా నమ్మడం సరికాదన్నారు. తల్లిదండ్రులు పోషకులు బాలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ప్రమాదం జరుగుతున్నట్లుగా అనుమానాలు ఉంటే అప్రమత్తమై 100,1098 టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించి టైం పొందాలని తెలిపారు. చదువుతోపాటు సామాజిక విలువలు జీవన నైపుణలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, సూపర్వైజర్ లైలా, ఎం ఎల్ హెచ్ పి సువర్ణ, బాల రక్ష భవన్ సిబ్బంది చంద్రశేఖర్,బాల ప్రవీణ్ ,డోంగ్రే ప్రవీణ్ రవళి ,సుగుణ ,శకుంతల, ఝాన్సీ రాణి ,సుకన్య ,ఉస్మాన్ ఆశా వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు