calender_icon.png 6 January, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీలను పట్టించుకోండి

17-07-2024 12:05:00 AM

అయిదు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు రావలసిన నిధులు ఆగిపోవడంతో గ్రామాల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్టు ఉండడమేకాక కనీస సౌకర్యాలకు కూడా డబ్బు లేని దుస్థితి నెలకొనడం అన్యాయం. ప్రజాస్వామ్య ప్రగతి అంతా గ్రామాలపైనే ఆధారపడి ఉంటుంది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ఊళ్లలో సదుపాయాలు లేకపోతే, ఆ ప్రభావం అధికార పార్టీ లపై పడుతుంది. రాష్ట్రంలోని దాదాపు 80 శాతం గ్రామ పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితి నిండుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రభు త్వాల పెద్దలు ఇప్పటికైనా స్పందించి పంచాయతీలకు రావలసిన నిధులను విడుదల చేయాలి.

-శ్రీనివాస్‌శర్మ, బెంగళూర్