calender_icon.png 4 January, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6న పవన్ పాడిన పాట విడుదల

02-01-2025 01:11:11 AM

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పిరియాడిక్ యాక్షన్ అడ్వంచర్ మూవీగా ఇది రూపొందుతోంది. తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ న్యూ ఇయర్ సందర్భంగా ఓ అప్‌డేట్‌ను పంచుకుంది.

ఈ చిత్రంలో పవన్ ఒక పాట పాడినట్టు తెలియజేస్తూ దానిని జనవరి 6న విడుదల చేస్తామని తెలిపింది. ‘మాట వినాలి’ అంటూ సాగే పాటను పవన్ ఆలపించారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరిట ఈ ఏడాది మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ స్వాతంత్య్రం కోసం పోరాడే ఓ యోధుడిగా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత పవన్ ఓ పాట పాడటంతో అది ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.