calender_icon.png 8 November, 2024 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంజన్న దర్శనానికి పవన్

30-06-2024 12:57:00 AM

కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు 

ఆధ్యాత్మిక ప్రాంతంలో రాజకీయాలు మాట్లాడను

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్

సిద్దిపేటలో ఘనస్వాగతం పలికిన అభిమానులు

జగిత్యాల/సిద్దిపేట, జూన్ 29 (విజయక్రాంతి): వారాహి పూజలో ఉన్నా. రాజకీ యాలు మాట్లాడను. కొండగట్టు ఆలయం లో అంజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకే వచ్చా అంటూనే తెలంగాణలో జనసేన,బీజేపీ మధ్య పొత్తు ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదెల పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. పవన్‌కల్యా ణ్ జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయసామిని శనివారం దరించుకున్నారు. అంజన్న దేవాలయానికి వచ్చిన పవన్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాగతం పలికారు.

ఆలయంలో ఆయన దాదాపు గంటసేపు ప్రత్యేక పూజలు నిరహించారు. ఆలయ అర్చకులు సామి వారి తీర్థ ప్రసాదాలు పవన్‌కు అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కొండగట్టు దేవాలయంలో వారాహి ప్రచార వాహనానికి పూజలు నిరహించగా గెలిచిన తరాత మొదటిసారి కొండగట్టుకు వచ్చి ప్రత్యేక పూజలు నిరహించారు. పవన్‌కల్యాణ్ రావడంతో ఆయనను చూడటానికి అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా? అని పలువురు విలేకరులు ప్రశ్నించగా రాజకీయాలు మాట్లాడనని, కానీ పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

సిద్దిపేటలో ఘన స్వాగతం 

పవన్‌కల్యాణ్ కొండగట్టులో దర్శనానికి వెళుతుండగా సిద్దిపేటలో ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి పవన్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై పొన్నాల వద్ద ఘనస్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్‌కు హనుమంతుని చిత్రపటాన్ని బహూకరించి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన అంజన్నను దర్శనం చేసుకుని మొక్కు చెల్లించి ప్రజాసేవలో నిమజ్ఞం అవుతానని చెప్పారు. ప్రతి అభిమాని, కార్యకర్త కఠోరమైన దీక్షతో శ్రమించాలని సూచించారు. ఈ స్వాగతం జన్మలో మరిచిపోలేనని చెప్పారు. 

పవన్‌కల్యాణ్‌కు కొండగట్టు అర్చకుల వినతి

జగిత్యాల, జూన్ 29(విజయక్రాంతి): కొండగట్టు అంజన్న క్షేత్రంలో వసతి గదుల నిర్మాణానికి కృషి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోని పలు దేవాలయాల్లో టీటీడీ నుంచి 100 వసతి గదులు నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పుడు కొండగట్టులో నిర్మాణానికి కృషి చేయాలని ఈవో చంద్రశేఖర్ ఆధర్యంలో విజ్ఞప్తి చేశారు.