- ‘సంధ్య’ ఘటనపై వాస్తవాలు తెలుసుకొని స్పందించారు
- ప్రభుత్వాన్ని విమర్శించడానికి బీజేపీ, బీఆర్‌ఎస్ పోటీపడ్డాయి
- బన్నీ అరెస్టుతోనే పుష్ప భారీ కలెక్షన్లు
- ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. సోమవారం అసెం బ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్టు విషయంలో అధికార పార్టీని వ్యతిరేకించేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ పోటీ పడ్డాయని.. పవన్‌కల్యాణ్ మాత్రం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడారన్నారు. తొక్కిసలాటలో ఒక మహిళ చని పోవడం, ఆమె కుమారుడు చికిత్స పొందుతున్న అంశంపై ఆయన రాజకీయ నాయకు డిగా కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తిగానే స్పందించారని కొనియాడారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు అనుకూలమని తాము అనుకోమన్నారు. జగన్ వంటి పాలన తెలంగాణలో లేదని పవన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అల్లు అర్జున్ అరెస్టు విషయం దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందని.. ఆయన అరెస్టు వల్లే సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు మంచి కళాకారుడని, నెక్ట్స్ సినిమాలో నటించడానికి ఆయనకు మంచి రోల్ కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు.