calender_icon.png 14 April, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ పోస్ట్

13-04-2025 12:39:03 PM

హైదరాబాద్: మార్క్ శంకర్(Pawan Kalyan Son Mark Shankar) ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్  పేర్కొన్నారు. చిన్నకుమారుడి ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు ఎంతో ధైర్యం ఇచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ లో వైద్య చికిత్సకు సహకరించిన మోదీకి పవన్ ధన్యవాదాలు తెలిపారు. మార్క్ శంకర్ కోలుకోవడంతో కుటుంబంతో కలిసి ఆదివారం ఉదయం సింగపూర్ నుంచి పవన్ దంపతులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ నెల 8న సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. 

కొడుకు మార్క్ శంకర్ తో కలిసి  హైదరాబాద్ చేరుకున్న పవన్ 

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల సింగపూర్ లో ఆయన కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో తన భార్య అన్నా లెజినోవతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లారు. ఈరోజు భార్య, కొడుకుతో కలిసి పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్(Shamshabad Airport)కు చేరుకున్నారు. గాయపడిన కుమారుడితో కలిసి పవన్ కళ్యాణ్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరడంతో ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి సిఐఎస్ఎఫ్ అధికారులు కొంతమేర ఇబ్బంది పడ్డారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆయన కొంత కాలం పాటు హైదరాబాదులోనే ఉంటారా లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.