09-04-2025 12:00:00 AM
సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్రమాదంలో గాయాలు
ఏపీ డిప్యూటీ సీఎంను పరామర్శించిన ప్రధాని
హైదారాబాద్, ఏప్రిల్ 8: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్ ్క శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్‌లోని స్కూల్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం విషయం తెలుసు కున్న తర్వాత పర్యటన ముగించుకొని సింగపూర్ బయల్దేరారు. కాగా సింగపూర్‌లోని రివర్ వ్యాలీ షాప్‌హౌస్‌లో ఉదయం 9.45 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తు న్నారు.
రెండు, మూడు అంతస్తుల్లో మంట లు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిం ది. ప్రమాదంలో 15 మంది చిన్నారులు సహా 19 మంది గాయపడ్డారు. ప్రమాదం లో ఓ చిన్నారి మృతిచెందినట్టు సింగపూర్ మీడియా కథనాలు వెల్లడించాయి. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ డిప్యూటీ సీఎం పవన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. మార్క్ శంకర్ త్వరగా కో లుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ కాన్వాయ్‌తో పరీక్షకు దూరం!
పవన్ కల్యాణ్ కాన్వాయ్ రాకతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారని, దీంతో తాము పరీక్షకు హాజరు కాలేకపోయామని వైజాగ్‌కు చెంది న పలువురు జేఈఈ మెయిన్స్ విద్యార్థులు ఆరో పించారు. అల్లూరి జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎన్‌ఏడీ కొత్త రోడ్డు నుంచి పెందుర్తి వరకు రెండుగంటల పాటు వాహనాలు నిలిపేశారని, దీంతో పరీ క్ష కేంద్రానికి 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకోగా.. తమను లోనికి అనుమతించలేదని 23 మంది అభ్యర్థులు ఆరోపించారు.