calender_icon.png 17 April, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీ ఎస్వీ ట్రస్ట్‌కు లెజినోవా భూరి విరాళం

15-04-2025 12:00:00 AM

అమరావతి, ఏప్రిల్ 14: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్‌కు ఏపీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణీ అన్నా లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట సోమవారం రూ.17 లక్షల భూరి విరాళమిచ్చారు. అందుకు సంబంధించిన చెక్కులను టీటీడీ అధికారులకు అందజేశారు. అనంతరం ఆమె స్వయంగా భక్తులకు దగ్గరుండి అన్న ప్రసాదాలు వడ్డించారు. అంతకముందు ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు. పవన్‌కల్యాణ్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. మార్క్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినందుకు గాను అన్నా లెజినోవా శ్రీవారి చెంతకు వచ్చి మొక్కు తీర్చుకున్నారు. పద్మావతి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి స్వామివారి పట్ల తన భక్తిప్రపత్తులను చాటుకున్నారు.