calender_icon.png 12 February, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

12-02-2025 02:19:30 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈరోజు దక్షిణ భారత రాష్ట్రాల్లో తన పర్యటనను ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడులోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. బుధవారం కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని(Sri Agastya Maharshi Temple) సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఆయన కుమారుడు అకీరా నందన్‌, తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) బోర్డు సభ్యుడు ఆనంద్‌ సాయి ఉన్నారు.

అనంతరం సాయంత్రం తిరువనంతపురంలోని పరశురామ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ మూడు రోజుల పాదయాత్రలో పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడులోని ఏడు పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. వీటిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం, మధురై మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర ఆలయం, స్వామిమలై, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నాయి.