calender_icon.png 14 April, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకుతో హైదరాబాద్‌కు పవన్ దంపతులు

13-04-2025 10:01:32 AM

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan) తన కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ అక్కడ వైద్య చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. తన కొడుకు గాయం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ కు వెళ్లారు. స్థానిక ఆసుపత్రిలో మార్క్ శంకర్ కోలుకున్న తర్వాత, పవన్ కళ్యాణ్ అతనితో కలిసి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆదివారం ఉదయం, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్( Mark Shankar) తో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుండి బయటకు వస్తున్నప్పుడు తన కొడుకును ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లేజ్‌నేవా నేడు తిరుమలకు వెళ్లనున్నట్లు సమాచారం. సోమవారం ఉదయం శ్రీవారిని ఆమె దర్శించుకోనున్నారు. అగ్నిప్రమాదంలో కుమారుడు సురక్షితంగా ఉండటంతో తిరుపతికి పవన్‌ సతీమణి పయనం కానున్నారు.