calender_icon.png 27 November, 2024 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు: పవన్ కళ్యాణ్

27-11-2024 12:31:42 PM

హైదరాబాద్: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం  భూపేంద్ర యాదవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.

పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలు తీసుకువచ్చారు. ‘‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటే మేలు జరుగుతుందని తెలిపారు. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్ గా వ్యవహరిస్తుందని, ఈ ప్రతిపాదననను పరిశీలించలరని పవన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందన్నారు. ఏ రాష్ట్రంలో పట్టుబడినా... ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈ క్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్ గా ఉండే ఏపీ రాష్ట్రానికే దక్కేలా చూడాలని కేంద్రమంత్రిని కోరారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదన్నారు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్ గా కొనసాగుతుందని పవన్ కల్యాణ్ కేంద్రమంత్రికి వివరించారు.