calender_icon.png 7 October, 2024 | 1:57 PM

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్ బాల్ లాంటివారు

07-10-2024 11:33:34 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఫుట్ బాల్ లాంటి వాడని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని చెప్పారు. పవన్ చెప్తున్న సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని స్పష్టం చేశారు. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇబ్బందుల్లో ఉందని వెల్లడించారు.

తాజాగా ఎంజీఆర్ పై జనసేనాని ట్వీట్ చేయగా.. ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ఉన్నట్లుండీ ఎంజీఆర్ పై ఎందుకింత ప్రేమో అంటూ సెటైర్ వేశారు. నటుడిగా పలు చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషించారు. పాలిటిక్స్ అలా కాదని ఆయన తెలుసుకోవాలన్నారు. ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుంది అని ప్రకాశ్ రాజ్ హితువు పలికారు. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదం నుంచి పవన్, ప్రకాస్ రాజ్ ల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.