calender_icon.png 30 September, 2024 | 7:54 PM

వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ భారీ విరాళం

04-09-2024 04:10:26 PM

అవరావతి: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు జలమయమైన్నాయి. దీంతో ఏసీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులు, గ్రామాలలో తాగునీరు, ఆహారం సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్షించారు.

వరద బాధితుల కోసం పవన్ వ్యక్తిగతంగా రూ.6 కోట్లు విరాళంగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్ లకు చెరో రూ.కోటి చొప్పున విరాళం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ లోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. అతిత్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజులు కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.