18-03-2025 12:00:00 AM
ప్రస్తుతం చకచకా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న కథానాయికల్లో శ్రీలీల టాప్‌లో ఉంది. ఈ ముద్దుగుమ్మ జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస హిట్స్‌తో స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అవకాశాలను సైతం అందిపుచ్చుకుంటూ తెగ బిజీ అయిపోయింది.
ఈ ముద్దుగుమ్మ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం విడుదలకు సిద్ధమవడంతో ప్రమోషన్స్‌లో సైతం పాల్గొంటోంది. ఈ క్రమంలోనే అమ్మడి గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని ఈ ముద్దుగుమ్మ బాగా వంట పట్టించుకున్నట్టుంది. ఒకేసారి పది సినిమాలకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్.
అయితే వాటన్నింటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ప్రస్తుతం నానా తంటాలు పడుతోందట. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ’ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి సైడ్ అయిపోనుందట. హరీష్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఆలస్యమవుతుండటంతో కొత్త సినిమాల షెడ్యూల్‌కి ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ను వదులుకోవాలని భావిస్తోందట శ్రీలీల.