calender_icon.png 9 October, 2024 | 11:48 AM

రాజకీయాల్లో పవన్ ఫుట్‌బాల్

08-10-2024 01:28:47 AM

 నటుడు ప్రకాశ్‌రాజ్

చెన్నై, అక్టోబర్ 7: రాజకీయాల్లో  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫుట్‌బాల్ లాంటి వారని, ఆయన్ను ఎవరో ఒకరు వాడుకుంటూనే ఉం టారని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విరుచుకుపడ్డారు. తిరుమల ల డ్డూ కల్తీ వివాదంలో స్పందించిన పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాశ్‌రాజ్ ఇప్పటికే అనేకసార్లు టార్గెట్ చేశారు. అనేకసార్లు ‘ఎక్స్’ మాధ్యమంగా ప్రతిస్పందించారు.

తాజాగా చెన్నై లో ఓ టీవీ ఇంటర్వ్యూలో పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవ న్ బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటున్నారని ఆరోపించారు. పవన్ అన్నట్లు సనాతన ధర్మం ప్రమాదంలో లేద ని, నిజానికి ప్రమాదంలో ఉన్నది బీజేపీ అని అభిప్రాయపడ్డారు. పవ న్ సినిమా తెరపై ఎన్ని పాత్రలైనా పోషించవచ్చని, రాజకీయాల్లో ఒక స్థిరమైన మార్గంలో నడిస్తే బాగుంటుందని హితవు పలికారు.