calender_icon.png 27 February, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవన్ ప్రతి అంశాన్నీ పరిశీలించారు

26-02-2025 10:46:05 PM

పవన్ కల్యాణ్, క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఒక పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొల్లగొట్టినాదిరో..’ పాట విడుదలై అభిమానులను ఒక ఊపు ఊపేస్తోంది.

దీనిపై నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రెండేళ్లుగా మేము ‘హరిహర వీరమల్లు’ కోసం వర్క్ చేస్తున్నాం. ‘కొల్లగొట్టినాదిరో’ లిరికల్ సాంగ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులతో పవన్ మాట్లాడుతున్న చిత్రాలను చూశారు. ఆయన స్క్రిప్ట్ వర్క్ నుంచి ప్రతి అంశాన్నీ పరిశీలించారు. పాత్ర, డైలాగ్స్ కోసం ఆయనెంతో వర్క్ చేశారు. అలాగే మా ఇద్దరి కాంబోలో వచ్చే సీన్స్ కోసం చర్చించుకుని.. అనంతరం పవన్, నేను ఇద్దరం రిహార్సల్స్ చేశాం. దీంతో సమయం వృథా కాకుండా చిత్రీకరణ సులువైంది” అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.