calender_icon.png 26 December, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపం "అట‌ల్ బిహారీ వాజ్‌పేయి"

25-12-2024 11:42:15 PM

ముషీరాబాద్,(విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం వాజపేయి అని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు.ఆయన సేవలు జాతీయత పట్ల నిబద్ధతకు పూర్తి నిండు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ డివిజన్లో మాజీ ప్రధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా జవహర్ నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో డివిజన్ బిజెపి నేత శశాంక్ ఆధ్వర్యంలో పారిశుద్య కార్మికులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎ.పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ... ద‌శాబ్దాల‌ పాటు ప్ర‌పంచం ప‌ట్ల ఉదార వైఖ‌రి, ప్ర‌జాస్వామ్య సిద్ధాంతాల ప‌ట్ల అంకిత‌భావం ఆయ‌న‌ను అసాధార‌ణ నాయ‌కునిగా నిల‌బెట్టాయనీ, మ‌హిళా సాధికార‌త‌, సామాజిక స‌మాన‌త్వం కోసం పాటుప‌డి, భార‌త‌ దేశం ప‌ట్ల ఆయ‌న‌ నిస్వార్థ అంకిత‌భావానికి, అర్థ శ‌తాబ్దంపాటు స‌మాజానికి, దేశానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా భార‌త  అత్యున్న‌త పుర‌స్కారాలను అందుకున్న మ‌హోప‌న్యాస‌కుడు అట‌ల్‌ జీ అని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపం. ఆయ‌న సేవ‌లు జాతీయ‌త ప‌ట్ల పూర్తి నిబ‌ద్ధ‌త‌కు నిండు నిద‌ర్శ‌నం’ అన్నారు. భారత రత్న,భారత మాజీ ప్రధాని ఆటల్ బిహారీ వాజపేయి  శతజయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు రత్న సాయి చంద్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, డి.సాయి రెడ్డి, కృష్ణ చారి, భారత్, సుక్క యాదగిరి, నర్సింహ, చిర్ర యాదగిరి, డోనేటి సత్యం, లక్ష్మీనారాయణ, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.