calender_icon.png 2 February, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘పట్టుదల’

01-02-2025 11:48:38 PM

అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. దీనిని ‘పట్టుదల’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, సీడెడ్‌లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. అజిత్ కుమార్ ‘పట్టుదల’ (విడాముయర్చి) సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.