కామారెడ్డి, జనవరి 3 (విజయక్రాంతి): తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పట్టాలు ఇవ్వాలని శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట కామారెడ్డి మున్సిపాలిటీలో ని రాజీవ్‌నగర్, రామేశ్వర్‌పల్లి, దేవుని లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ధర్నాచౌక్ వద్ద ఆం చేపట్టారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టాలు ఇవ్వకపోవడంతో వసతులు సమకూరడం లేదని వాపోయారు. అధికారులకు చెప్పి నా పట్టించుకోకపో హిడంతోనే ఆం దోళన చేపట్టినట్లు తెలిపారు. పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ సముఖంగా ఉన్నా అధికారులు పట్టించు కోవడం లేదని వాపోయారు.
కామారెడ్డి ఆర్డీవో రఘునాథ్‌రావు వారి వద్దకు వచ్చి మాట్లాడారు. వారం రోజుల్లో పట్టాలు ఇప్పిస్తా రెండు రోజుల్లో తమ సిబ్బంది వచ్చి ఇంటింటికీ తిరిగి ఫొటోలు, వివరాలు సేకరస్తానని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు.