వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ మను చౌదరి...
కొండపాక: గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి పి సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి కరీంనగర్, నిజాంబాద్, మెదక్, అదిలాబాద్, పట్టాభద్రులు, టీచర్స్ శాసనమండలి సభ్యుల స్థానానికి ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని అన్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాలలో ఎన్నికల కోడ్ అమలు చేయాలని రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు గోడల పైన రాతలు జెండాలు ప్రకటనలు తొలగించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మనో చౌదరి, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.