calender_icon.png 28 October, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే ఎల్‌ఏసీ వద్ద గస్తీ

28-10-2024 01:02:58 AM

  1. భారత్, చైనా మధ్య పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం
  2. రెండు దేశాల ఒప్పందంపై స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్

ముంబై, అక్టోబర్ 27: వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా దళాలు అతి త్వరలోనే గస్తీ మొదలు పెడుతాయని విదేశాంగమం త్రి జైశంకర్ వెల్లడించారు. ముంబైలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

డెమ్‌చోక్, దెప్సాంగ్ వద్ద 2020 ముందు నాటి గస్తీ ఏర్పాట్లు ఉంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పం దంతో పలు ఆంక్షలు తొలగిపోనున్నట్లు చెప్పారు. అయితే ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని, భవిష్యత్తులో జరగబోయే చర్చల్లో సరిహద్దుల నిర్వహణ, స్థిరత్వంపై చర్చిస్తామన్నారు. 

కొన్ని చోట్ల మాత్రమే

చైనాతో చర్చల సఫలం కావడానికి సైన్యం, దౌత్య బృందాల కృషే కారణమని జైశంకర్ చెప్పారు. దేశ రక్షణ కోసం సైన్యం కఠిన పరిస్థితుల్లో పని చేస్తోందని ప్రశంసించారు. ఇటీవల జరిగిన ఒప్పందంతో దెప్సాంగ్, డెమ్‌చోక్‌లో ఇరు దేశాలు బలగా ల ఉపసంహరణ మొదలుపెట్టాయి. త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ఒప్పందం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. మరికొన్ని ప్రాంతాలపై చర్చలు కొనసాగుతున్నాయి.