బలగాల ఉపసంహరణ పూర్తి
న్యూఢిల్లీ, నవంబర్ 1: తూర్పు లడఖ్‌లోని డెప్సాంగ్, డెమ్‌చాక్ ప్రాంతాల్లో మోహరించిన భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయి. 16వ బ్రిక్స్ సమావేశాలకు ముందు ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అదనపు బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం పూర్తుం ది. దీపావళి సందర్భంగా ఆ ప్రాంతా ల్లో గురువారం పెట్రోలింగ్ కూడా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ వెంట మొత్తం ఐదు ప్రాంతాల్లో ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. దీంతో తూర్పు లడఖ్‌లో 2020 కంటే ముందు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.