calender_icon.png 28 October, 2024 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి

28-10-2024 12:17:47 AM

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ముషీరాబాద్, అక్టోబర్ 27(విజయక్రాంతి): విద్యార్థులు, యువతలో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ప్ర ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్‌లోని ఆర్య వైశ్య భవన్‌లో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో పిల్లల్లో దేశభక్తిని పెంపొందించేందుకు దేశభక్తి బృందగానం పోటీలను నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. మన దేశ సంస్కృతీ సాంప్రదాయాలను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలన్నారు. కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి మాట్లాడు తూ విద్యార్థులు, యువతలో జాతీయ భావాజాలం, దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

గత 50 ఏళ్లుగా విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు అనేక కార్యాక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. దేశ భక్తి పాటల పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు డిసెంబర్ 15న బెంగళూరులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపా రు.

భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సతీశ్‌గౌడ్, నాగరాజు మాట్లాడుతూ దక్షిణ భారత దేశభక్తి బృందగాన పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సౌత్ భారత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శాస్త్రి, సంయుక్త కార్యదర్శి నరేంద్ర కృష్ణ, నాయకులు నాగేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, రాజలింగం, అంభిక, సత్యనారాయణ పాల్గొన్నారు.