సంగారెడ్డి (విజయక్రాంతి): నారాయణఖేడ్ నియోజకవర్గం నగల్ గిద్ద మండల పరిధిలోని పూసల్ పాడ్ గ్రామ చౌరస్తా దగ్గర ఉన్న విజయ పత్తి మిల్లులో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు గుండె రావు పాటిల్, అనిల్ పాటిల్, సంజీవ్ పాటిల్, మాజీ సర్పంచ్లు, విష్ణువర్ధన్ రెడ్డి, విజయ్ కుమార్ సచిన్ పాటిల్, సంతోష్ కుమార్, డి హనుమంతు, తదితర నాయకులు పాల్గొన్నారు.