calender_icon.png 29 December, 2024 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయిస్తాం

27-12-2024 02:36:25 AM

*  ఐజీ సత్యనారాయణ

వికారాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నప్పుడు మీడియా సమావేశం నిర్వహించి చట్టవిరుద్ధ వ్యాఖ్యలు చేశారని, ఈ విషయమై కోర్టును ఆశ్రయించి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతామని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం కొడంగల్ నియోజకవర్గం దుద్యాల్ మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణ పాల్గొన్నారు.

అనంతరం పరిగిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాతూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని ఫార్మా భూసేకరణ విషయంలో అరెస్ట్ చేయలేదని తెలిపారు. నరేందర్‌రెడ్డి విచారణను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తే అట్టి ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అధికారులపై దాడి జరిగిన రోజు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అయితే ఏలూ ఉన్న సురేశ్ పతకం ప్రకారం కలెక్టర్‌ను నమ్మించి గ్రామంలోకి తీసుకెళ్లినట్లు ఐజీ తెలిపారు. సురేశ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు సురేశ్ వాయిస్ రికార్డును బయట పెడతామన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సైతం తన ఫోన్ లాక్ నెంబర్ చెప్పడం లేదని, ప్రెస్‌మీట్లు పెట్టి తప్పుడు విచారణ జరుగుతున్నట్లు పేర్కొనడం సరికాదన్నారు. ఆయన వెంట వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి ఉన్నారు.