calender_icon.png 16 January, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్నంకు రెండ్రోజుల పోలీసు కస్టడీ

07-12-2024 01:14:45 AM

ఉత్తర్వులిచ్చిన కొడంగల్ కోర్టు

వికారాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ కొడంగల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిం ది. కలెక్టర్‌స్థాయి అధికారులపై దాడి వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో మూడుసార్లు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

పట్నంను శని, ఆదివారాల్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే నరేంద ర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని కాల్ డాటా పరిశీలనకు పాస్‌వర్డ్ అడగగా ఆయన నిరాకరించినట్టు సమాచారం. కాగా రెండు రోజుల విచారణలో దాడికి సం బంధించిన విషయాలు తెలుస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.