వికారాబాద్,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి చేసిన ఘటనలో కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలతో పోలీసులు బుధవారం అరెస్టు చేసి వెద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. నరేందర్ రెడ్డికి కోర్టు 14 రోజులపాటు ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. పట్నం నరేందర్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్ల ఘటనలో ఇప్పటికే 16 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఇవాళ ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని కోర్టుకు తరలించే నేపథ్యంలో మీడియాలో మాట్లాడారు. అక్రమంగా తనను అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.