హైదరాబాద్,(విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత కొద్దిరోజు క్రితం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ప్రభుత్వాధికారులపై, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన ఘటనలో నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ లగచర్ల ఘటనకు ముందే బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ లో నరేందర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా మందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు పట్నం నరేందర్ రెడ్డికి విచారణకు సహకరించాలని, రూ.25 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది.