పీకేఎల్ 11వ సీజన్
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నేడు పుణే వేదికగా పట్నా పైరేట్స్, హర్యానా స్టీలర్స్ మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది. హర్యానా జట్టులో ఆల్‌రౌండర్ షాదులు, రెయిడర్లు శివమ్ పటారే, వినయ్ కీలకం కానుండగా.. ఇక స్టార్ రెయిడర్లు దేవాంక్, అయాన్ పట్నా పైరేట్స్‌కు వెన్నుముకగా ఉన్నారు. గతేడాది రన్నరప్‌కు పరిమితమైన హర్యానా ఈసారి మాత్రం పీకేఎల్ చాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు ఇప్పటికే మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ మరో టైటిల్‌పై కన్నేసింది. సెమీస్‌లో హర్యానా స్టీలర్స్ యూపీ యోధాస్‌పై అతికష్టం మీద నెగ్గగా.. దబంగ్ ఢిల్లీపై పట్నా పైరేట్స్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.