మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, సెప్టెంబరు 9 (విజయక్రాంతి): కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుప త్రిలో రోగులకు మెరుగైన వైద్యం అంది ంచాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించా రు. సోమవారం కరీంనగర్‌లోని ఆసుపత్రి లో ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అవసరమైన ఏసీలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు మున్సిపల్ కమిషనర్, ఆసుసత్రికి అవసరమైన పరికరాలు, మందులకు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిధులు విడుదల చేస్తారని తెలిపారు. అంబులెన్స్ మరమ్మతుకు తక్షణ అవసరం కింద రూ.9 లక్షలు కలెక్టర్ విడుదల చేస్తారని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.