మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నల్లగొండ, జూలై 5 (విజయక్రాంతి) : ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా దవాఖానను శుక్రవారం ఆయన పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో సరిపడా డయాల సిస్ యంత్రాలు లేనందున మరో ఐదు యంత్రా లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దవాఖాన ఆవరణలో విరివిగా మొక్క లు నాటాల ని, రోగుల కోసం వచ్చే వారు విశ్రాంతి తీసుకునేలా బల్లాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అంతకు ముందు ప్రకాశ్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.