calender_icon.png 8 February, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేషెంట్లకు నాణ్యమైన వైద్యం అందించాలి

08-02-2025 12:00:00 AM

  1. ల్యాబ్ టెక్నీషియన్‌కు షోకాజ్ నోటీసులు
  2. కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 7 (విజయక్రాంతి ) ః ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు వైద్యాధికారులు, సిబ్బంది నాణ్యమైన  వైద్యం  అందించి ప్రజలకు అందుబాటులో ఉండాలని  జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శుక్రవారం రోజు భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ ను పరిశీలించి టి  ఎస్ విలియమ్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ (గ్రేడ్-2) విధులకు హాజరు కాకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ల్యాబ్ టెక్నిషన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఎంతమంది  సిబ్బంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులు సమయపాలన పాటించాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.

మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అత్యవసర విభాగం సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండాలని ఆదేశిం చారు. ఓపి రిజిస్టర్ ను తనిఖీ చేస్తూ  జనవరి నెలలో 23, ఈడీలు ఉండగా 07 డెలివరీలు మాత్రమే చేశారని, ఫిబ్రవరిలో 32 ఈడిడిలు ఉండగా.. వాటిలో 01 డెలివరీ మాత్రమే చేశారని, వాటి సంఖ్య  పెంచాలన్నారు.

కలెక్టర్ స్వయంగా ఓపి రిజిస్టర్‌లో గల నమోదు అయిన పేషంట్ కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం మంచిగా అందిస్తున్నారు. సేవలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.