07-03-2025 12:47:18 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, మార్చి 6 (విజయ క్రాంతి ): వివిధ రోగాలతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు డాక్టర్లు, సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ లు మరియు సిబ్బంది విధులకు సమయానికి రావాలని ఆదేశించారు.
అక్కడ ఉన్న పేషెంట్లను పలకరిస్తూ వసతులు ఎలా ఉన్నాయని పేషెంట్లు అడిగి తెలుసుకున్నారు. వైద్యం సమయానికి అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ లో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓ ను ఆదేశించారు.
ప్రజలు ప్రెవేట్ హాస్పిటల్ కి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి లో ఉన్న అన్ని సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని డబ్బులు వృదా చేసుకోకుండా వినియోగించుకోవాలన్నారు. తదుపరి కమలమ్మ అనే ప్రెగ్నెంట్ లేడీ రాజాపేట ఆసుపత్రి నుండి జిల్లా ఆసుపత్రి కి పంపిస్తే అక్కడ సిబ్బంది, వచ్చి న పేషెంట్ పై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
అనంతరం రాజాపేట మండలం బొందుగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా పది పరీక్షలకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉందని, ప్రాధాన్యత కలిగిన అంశాలపై పట్టు సాధించే దిశగా నిరంతర సాధన చేయాలన్నారు. ఏదేని సబ్జెక్టులో వెనుకంజలో ఉన్న విద్యార్థులు ఈ 15 రోజుల్లో మరింత కష్టపడితే తప్పకుండా ఉత్తీర్ణులవుతారని ప్రీఫైనల్ పరీక్షలు ఎలా వ్రాస్తున్నారని ఉపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు రాస్తున్న పరీక్షల ను స్వయంగా పరిశీలించి విద్యార్థులు వ్రాసిన తప్పులను సరిదిద్ది అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. విద్యార్థులతో మాట్లాడుతూ కష్టపడి ఇష్టంతో చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చని అన్నారు. పదవ తరగతి అనేది చదువులో మొదటి మెట్టు అన్నారు.
తదుపరి ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయు నిలతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలని, వెనుకబడిన విద్యార్థులకు స్పెషల్ తరగతులు నిర్వహించి , గణితం , ఫిజిక్స్ సబ్జెక్టుల పై ఎక్కువ శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచే విధంగా చూడాలన్నారు.
పరీక్షలు దగ్గరకు వస్తున్నందున విద్యార్థులు పరీక్షలకు ముందు ఒకటికి రెండు సార్లు చదివి వ్రాస్తూ ప్రాక్టీస్ చేయాలని, మంచి మార్కు లు సాధించి తలిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం బొందుగుల మండలంలోని పలె దావఖానను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
ఈ సందర్భంగా హాజరు, ఓ.పి రిజిస్టర్ లను పరిశీలించి , విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మానస ఎమ్మె ఎల్ హె పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. సమయపాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.