18-02-2025 02:43:39 PM
హుటా హుటా మంచిర్యాలకు తరలింపు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి భవనం మొదటి అంతస్తు నుండి సోము అనే రోగి కిందికి దూకిన విషయం మంగళవారం వెలుగు చూసింది. కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన సోము అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి భార్యతో గొడవ పడడంతో సోమవారం అతని కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఆసుపత్రిలో చేర్పించారు. అదేరోజు మధ్యాహ్నం ఆసుపత్రి భవనం మొదటి అంతస్థకు చేరుకొని అక్కడి నుండి కిందికి దూకాడు. ఈ ఘటనలో సోము నుదురుకు, ముక్కు భాగంలో గాయాలు కావడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.