సీజర్ పట్టుకొని మిగతా రోగులను భయభ్రాంతులకు గురిచేసిన రోగి
ఆందోళన చెందిన రోగులు
ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలో ఘటన
కామారెడ్డి,(విజయక్రాంతి): ఐసీయూలో ఉన్న ఓ రోగి పక్కనే ఉన్న సీజర్ పట్టుకొని పక్కనున్న రోగులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బుధవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా కేంద్రఆస్పత్రిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం(Kamareddy town)లోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన అవుసుల ప్రమోద్ ఈ నెల 12న పురుగుల మందు సేవించడంతో అతని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతున్న ప్రమోద్ ను వైద్యులు ఐసీయూలో అడ్మిట్ చేయగా కళ్ళు సేవించకపోవడంతో పిచ్చిపిచ్చిగా వ్యవహరించాడు. దీంతో ప్రమోద్ కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున ఐసీయూ(ICU)లో కట్లు విప్పుకొని అక్కడ ఉన్న సీజర్ పట్టుకొని అందరిని బెదిరిస్తూ ఐసి నుంచి డెలివరీ చేసే రూమ్ లేబర్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ప్రమోద్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రమోద్ సిజరిన్ పట్టుకుని మిగతా రోగులను భయభ్రాంతులకు గురి చేయడంతో రోగులు తీవ్ర ఆందోళన చెందారు. డోరు వేసుకుని ఉన్న ప్రమోద్ ను సిబ్బంది బుజ్జగించి డోర్ తెరవాలని ప్రాధేయపడడంతో రూమ్ లో ఉన్న అద్దాన్ని పగలగొట్టాడు. సిబ్బంది లోపలికి ప్రవేశించి అతని చేతిలో ఉన్న సిజరిన్ తొలగించిన సిబ్బంది అతడిని పట్టుకుని ఐసీయూలోకి తెచ్చి చికిత్స అందించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులను కలవరానికి గురిచేసింది. నిత్యం కళ్ళు తాగడం అల వాటు ఉన్న ప్రమోదుకు కళ్ళు లేకపోవడంతో పిచ్చిగా వ్యవహరించారని పలువురు తెలిపారు. కుటుంబ సభ్యులు కళ్ళు తెచ్చి తాపించడంతో ప్రమోద్ పిచ్చి వదిలింది.