28-04-2025 06:51:17 PM
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...
హుజురాబాద్ (విజయక్రాంతి): ఆయుష్మాన్ భారత్ లో రోగుల వివరాలు పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) వైద్యులకి సూచించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు ఆధార్, ఫోన్ నెంబర్ సేకరించి ఆయుష్మాన్ భారత్ లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు.
బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మాత్రలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలకు మల్టీ విటమిన్ టాబ్లెట్లు కాల్షియం, ఐరన్ మాత్రలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. టెలివిజన్లో అవగాహన కార్యక్రమాలు ప్రదర్శించాలని సూచించారు. ఓపి రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రికి వచ్చిన కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిమేల్ వార్డు సందర్శించి అక్కడ చికిత్స పొందునతో మాట్లాడారు. సాధారణ ప్రసవం గురించి అవగాహన కల్పించారు. ఆమె వెంట డాక్టర్ సుచిత్ర ఉన్నారు.