08-02-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) ః పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వారం రోజులపాటు కొనసాగే స్వామివారి తిరు కళ్యాణవార్షిక బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆగమ శాస్త్ర రీతిలో సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. స్వస్తి వాచనంతో వేద పండితులు రుత్వికులు పారా యణుకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకా రం చుట్టారు. బ్రహ్మోత్సవాల్లో అను వంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ఈవో భాస్కరరావు, ప్రధానా ర్చకులు, ఉప ప్రధానార్చకులు, య జ్ఞాచార్యులు,అర్చకులు పాల్గొన్నారు.