06-03-2025 01:07:09 AM
కొత్తపల్లి, మార్చి 5: శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల రసాయన శాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ కోట రాజుకి పేటెంట్ లభించింది. “కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆనోడ్ - కాతోడ్ పేరింగ్ ఫర్ మాక్సిమం సెలెక్టివిటీ ఇన్ ఎలక్ట్రో కెమికల్ పొల్యూటెడ్ డిగ్రీడేషన్” అనే అంశంపై పేటెంట్ లభించింది. ఈ సందర్భంగా ఆయనను విశ్వవి ద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా.జయం తి, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ నమ్రత, సరసిజ ఇతర సైన్స్ కళాశాల అధ్యాపకులు అభినందించారు.