10-04-2025 10:40:44 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నాగులపాటి అన్నారంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్తినేని శ్రీనివాస్ మాతృమూర్తి ముత్తినేని అనసూర్యమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈమేరకు గురువారం మృతురాలు అనసూర్యమ్మ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, నాయకులు యాట ఉపేందర్, సామ సురేందర్ రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.