సూర్యాపేట,(విజయక్రాంతి): క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర పర్యాటక అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సెంటినరి బాప్టిస్ట్ చర్చిలో బుధవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మాతాల సారాంశం ఒక్కటేనన్నారు. క్రీస్తు ఎంచుకున్న మార్గం అందరికి దిక్సూచి అన్నారు. 125 కలిగిన సెంటినరి చర్చికి పర్యాటక అభివృద్ది తరపున నిధులను మంజూరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ ప్రభుదాస్, కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్య కరుణాకర్, చర్చి కమిటీ అధ్యక్షుడు జాన్ సుమిత్ర మర్రి నెహమియా, సభ్యులు, క్రైస్తవ సోధరులు పాల్గొన్నారు.