హైకోర్ట్ యాక్టింగ్ సీజే జస్టిస్ సుజయ్‌పాల్
హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): అడ్వొకేట్లకు ఆదర్శప్రాయుడు వల్లభాయ్ పటేల్ అని హైకోర్ట్ యాక్టింగ్ సీజే జస్టిస్ సుజయ్‌పాల్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా ఆదివారం ఆయన హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. పటేల్ న్యాయవాదిగా బొంబై హైకోర్టులో ప్రాక్టీస్ చేసే సమయంలో ఓ జటిలమైన కేసుకు సంబంధించిన పత్రాలు లేకుండానే వాదించారని గుర్తుచేశారు.
పటేల్ కోర్టులో వాదించిన విషయాలను కోర్టు అధికారులు రికార్డు చేయగా, అది 2 వేల పేజీలు వచ్చిందని తెలిపారు. పటేల్ సామర్థ్యాన్ని చూసి బ్రిటీష్ పాలకులు, న్యాయ నిపుణులే నివ్వరపోయారని కొనియాడారు.
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు తగ్గాలంటే విచారణ వేగవంతం కావాల్సి ఉందని, అందుకు న్యాయవాదుల సహకారం అవసరమన్నారు. న్యాయవాదులు పటేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నర్సింహశర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.