calender_icon.png 29 December, 2024 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదువుకున్న పోరి కోసం పటేల్ తిప్పలు

01-08-2024 12:05:00 AM

తేజస్ కంచర్ల (హుషారు ఫేమ్) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ అనే ట్యాగ్ లైన్‌తో రానున్న ఈ సినిమాని లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై కంచర్ల బాలభాను నిర్మిస్తున్నారు. వివేక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫర్. కుష్బూ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం అడవి శేష్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. తెలంగాణలో జరిగే ఈ కథలో చదువుకున్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనే యువకుడిగా తేజస్ కనపడ్డారు.

టీజర్‌లో ఆ నేపథ్యంలోని సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. ఇదే విషయమై మీడియాతో సమావేశమైంది చిత్ర బృందం. ఈ సమావేశంలో తేజస్ కంచర్ల మాట్లాడుతూ “మంచి సినిమా చేయాలని కొంత సమయం తీసుకున్నా. మా దర్శకుడు వివేక్ అలాంటి కథతో వచ్చారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందించిన పాటల్ని ఆగస్టు నుంచి విడుదల చేయనున్నాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వివేక్ రెడ్డి, హీరోయిన్ కుష్బు చౌదరి, నిర్మాత బాల భాను, ప్రవీణ్ లక్కరాజు పాల్గొన్నారు.