calender_icon.png 30 October, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పతంజలి’కి రూ.4 కోట్ల ఫైన్

31-07-2024 03:03:14 AM

ముంబయి: పతంజలి సంస్థకు బాంబే హైకోర్టు రూ.4 కోట్ల భారీ జరిమానా విధించింది. మంగళం ఆఆర్గానిక్స్ లిమిటెడ్ దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ వివాదం కేసుకు సంబంధించి కంపెనీ కర్పూరం ఉత్పత్తులను విక్రయించకుండా నిషేధిస్తూ 2023లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు కోర్టు ఈ జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను పతంజలి ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని జస్టిస్ ఆర్‌ఐ చాగ్లా నేతృత్వంలోని బెంచ్ పూర్కొంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం పతంజలికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

కోర్టు గతంలో ఆదేశించినా కంపెనీ ఉత్పత్తి విక్రయాలు, తయారీని కొనసాగించడాన్ని గమనించిన బెంచ్ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పతంజలి కంపెనీ మునుపటి డైరెక్టర్‌కు న్యాయవాది అంద్యార్జున కోర్టు ఆదేశాలను తెలియజేసినప్పటికీ ఆయన అనుసరించలేదని ప్రస్తుత డైరెక్టర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పాత డైరెక్టర్ తరఫున ప్రస్తుత డైరెక్టర్ క్షమాపణ చెప్పారు. అయినా జస్టిస్ చాగ్లా సంస్థకు రూ.4 కోర్టు జరిమానా విధించారు.