న్యూఢిల్లీ, నవంబర్ 24: బాబా రామ్‌దేవ్ ప్రమోట్ చేసిన పతంజలి ఆయుర్వేద ఆదాయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 23 శాతం వృద్ధిచెంది రూ. 9,335 కోట్లకు చేరింది. లాభం ఐదు రెట్లు ఎగిసి రూ.578 కోట్ల నుంచి రూ. 2,901 కోట్లకు పెరిగింది. అన్‌లిస్టెడ్ కంపెనీ అయిన పతంజలి ఆయుర్వేద ఆర్థిక ఫలితాల్ని ఆర్‌వోసీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
పతంజలి ఆయుర్వేద సబ్సిడరీ పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) ఆదాయం, ఇతర ఆదాయం తోడ్పాటుతో కంపెనీ వృద్ధి సాధించింది. పతంజలి ఆయుర్వేద ఇతర ఆదాయం 2022 రూ.46.18 కోట్లుకాగా, 2024 మార్చితో ముగిసిన ఏడాది రూ. 2,875 కోట్లకు పెరిగింది. అమ్మకాల ఆదాయం మాత్రం 14 శాతం క్షీణించి రూ. 6,460 కోట్లకు తగ్గింది.